VIZAGVISION:Vizag Bay Marathorn” on 23rdDec at Rk Beach,Amaravathi..వైజాగ్ బే మారథాన్”కు ఘనంగా ఏర్పాట్లు
విశాఖ వాసుల నుంచి అనూహ్య స్పందన
విశాఖపట్నం సముద్ర తీరాన ఈ నెల 23న “వైజాగ్ బే మారథాన్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ప్రైమ్ లైఫ్ స్పోర్ట్స్, దీప్ ట్రస్ట్ సంస్థలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆర్కే బీచ్ వద్ద సాయం సంధ్య సమయంలో జరగనున్న మారథాన్లో పాల్గొనేందుకు విశాఖ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన వెబ్సైట్ www.vizagbaymarathon.com ద్వారా మంచి స్పందన వచ్చిందని, పెద్ద సంఖ్యలో ప్రజలు మారథాన్లో పాల్గొడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు), 10కె, 5కె శ్రేణీల్లో ఈ మారథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య పరిరక్షణే ప్రధానాంశంగా మారథాన్ జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు ఇటువంటి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటూ ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నారని రేస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మురళి నన్నపనేని వెల్లడించారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించే లక్ష్యం అందరికి ఉండాలని, దానిలో భాగంగానే ఈ మారథాన్ ఒక ప్రయత్నమని తెలిపారు.