VIZAGVISION:Once Again Gold prices Dropped,Delhi…శుక్రవారం జరిగిన బులియన్ ట్రేడింగ్లో బంగారం ధర మరోసారి తగ్గింది. అయితే, గత కొద్ది కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. మళ్లీ శుక్రవారం తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.155 తగ్గి.. రూ. 29,510కి చేరింది.
అంతర్జాతీయ పరిస్థితులు, ఆభరణాల తయారీదారులు బంగారం ధర తగ్గుదలకు కారణమయ్యాయని బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలావుంటే, వెండి ధర కూడా భారీగా తగ్గడం గమనార్హం.
కిలో వెండి రూ.480 తగ్గి, రూ.37,800లకు చేరింది. అంతర్జాతీయ ఔన్సు బంగారం ధర 0.22శాతం తగ్గి, 1252.70డాలర్లకు పరితమైంది. వెండి కూడా ఔన్సు 1.06శాతం తగ్గడం ద్వారా 15.80డాలర్లకు చేరింది.
కాగా, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతోనే బంగారం తగ్గినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం బులియన్ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.