VIZAG VISION:Rahul’s first speech as Congress president….ఈ దేశం మీద నమ్మకంతోనే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని కాంగ్రెస్ పార్టీ 49వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయాలు అనేవి ప్రజలకు అస్త్రల్లాంటివని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిందని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ, ఇప్పటి ప్రధాని దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని అన్నారు. బీజేపీ కారణంగా హింస చెలరేగుతోందని ఆరోపించారు.
ప్రజల ఆలోచన, అలవాట్ల మీద దాడి జరుగుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ వృద్ధ పార్టీనే కాదు, అత్యంత యువ పార్టీ కూడా అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది దేశ ప్రజల మధ్య వారధి లాంటిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాలని కొందరు అనుకుంటున్నారని రాహుల్ అన్నారు.
అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో తమపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మన రాజకీయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. తాను 13ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు.
ప్రస్తుతం రాజకీయాల పరిణామమే మారిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలను ఉపయోగించడం లేదని అన్నారు. సాధారణ ప్రజానీకాన్ని అణచివేయడానికే