VIZAG VISION:Minimum temperature in Andhra Kashmir,Lammasingi Visakhapatnam….ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
లంబసింగిలో 4, చింతపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు.
కాగా కొద్ది రోజులుగా ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
.