VIZAGVISION:ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 వ విడత జన్మభూమి మావూరు కార్యక్రమం నేడు దర్శి ఏ.పి మోడల్ స్కూల్ ఆవరణలో గౌరవ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ప్రారంభించనున్నారు.రాష్టం అంతా ఒక పండగ సంబరాలు తలపించే ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యావరణ,అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శిలో ముఖ్యమంత్రి గారి కోసం ఘనమైన ఏర్పాటు చేశారు. తమ ప్రియతమ నాయకుడి రాక సందర్భంగా దర్శి పట్టణంలో ఎటుచూసినా పచ్చటి తోరణాలు,ఫ్లెక్సీలు,స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు అభిమానులు.సంక్రాంతి శోభను సంతరించుకున్న ఈ జన్మభూమి మావూరు కార్యక్రమానికి ఉదయం నుండే శిద్దా అభిమానులు,శిద్దా యూత్ ఫోర్స్,ప్రజలు,నాయకులు,కార్యకర్తలు దర్శిలో సందడి చేస్తున్నారు.ప్రజలు వేలాదిగా తరలిరావటం విశేషంగా భావించవచ్చు.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు,భారీ బందోబస్తు, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చక్కటి భోజన ఏర్పాటు,త్రాగునీరు,మజ్జిగ,తతి మొదలగు ఏర్పాటు శిద్దా సుధీర్ కుమార్ గారి పర్యవేక్షణ,స్థానిక నాయకులు, అధికారుల సహకారంతో ఎవరికి ఏ లోటు రాకుండా ఏర్పాటు చేశారు.ఈ జన్మ భూమి మావూరు గ్రామ సభలో అనేక మంది లబ్ధిదారులకు పింఛన్లు,రేషన్ కార్డ్స్ ముఖ్యమంత్రి గారి చేతులమీదగా అందివ్వనున్నారు.అలాగే సుమారు రూ.200 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి గారితో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు మాన్యశ్రీ శిద్దా రాఘవరావు గారు.