VIZAG VISION:Restrictions on visiting Taj Mahal….తాజ్‌మహల్‌ను సందర్శించే భారత పర్యాటకులకు అధికారులు ఆంక్షలు విధించారు. భారత్ నుండి రోజుకి 40 వేల మంది పర్యాటకుల్ని మాత్రమే అనుమతిస్తారని, పిల్లలకు 15 సంవత్సరాల వయస్సు వరకు ఎటువంటి టికెట్ అవసరం లేదని పురావస్తు శాఖ అధికారులు, పోలీసులు, పారామిలటరీ అధికారులు సంయుక్తంగా ఆదేశాల్ని జారీ చేశారు. తాజ్ సందర్శనకు గాను పెద్దవారికి రూ.
100 టికెట్‌ను వసూలు చేస్తారు. విదేశీ పర్యాటకులకు ఎటువంటి నిబంధనలూ లేవని పేర్కొన్నారు. ఈనెల 20 నుండి ఈ నిబంధనలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్ శర్మ తెలిపారు