VIZAGVIISION: Vizag Going Pink Cancer Patents for 10k Run at R.k Beach,Visakhapatnnam… విశాఖ లో క్యాన్సర్ రోగుల సాయం కోసం బీచ్ రోడ్లో వైజాగ్ గోయింగ్ పింక్ పేరిట 10కె, 5కె, 3కె పరుగులను నిర్వహించారు. ఈ పరుగు కార్యక్రమాన్ని బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్, నగర ట్రాఫిక్ ఏసీపీ కింజరపు ప్రభాకర్ ప్రారంభించారు. కేవలం మహిళల కోసం మాత్రమే నిర్వహించిన ఈ పరుగులో పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్దులు పాల్గొన్నారు. కొంతమంది మహిళలు తమ చంటి పిల్లలను భుజాన వేసుకుని ఈ పరుగులో పాల్గొనడం విశేషం. గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పరుగు చాలా విజయవంతమైందని, మూడోసారి ఆర్కే బీచ్ లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మిలింద్ సోమన్ తెలిపారు. వక్షోజాల క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు, క్యాన్సర్ రోగులకు సహాయం కోసం ఈ పరుగును చేపట్టినట్టు మిలింద్ సోమన్ తెలిపారు. మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా నిర్వహించిన ఈ పరుగు చాలా ప్రత్యేకమైందని.. ఆడవారికి మాత్రమే నిర్వహించే ఈ పరుగులో పాల్గొనడానికి ప్రతీ మహిళ ముందుకు రావడం మంచి విషయమని ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ అన్నారు. పరుగు ప్రారంభానికి ముందు నిర్వహించిన జుంబా నృత్యంలో మహిళలంతా పాల్గొని ఫిటెనెస్ కసరత్తు నృత్యం చేస్తూ సందడి చేశారు.