VIZAG VISION:Appoint a New Governor to the State of Andhra Pradesh MLA Vishnu kumar BJP,Visakhapatnam….విశాఖ బిజేపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుత గవర్నర్ ఆంద్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా ఆంద్ర రాష్ట్రానికి కొత్త గవర్నర్ ని నియమించాలని కోరారు. రాష్ట్రంలో ఎవరైనా గౌరవ అతిధులు వస్తే తప్ప మిగిలిన సమయంలో ఏడాదిలో వారం రోజులు కూడా ఆయన రాష్ట్రంలో గడిపేది లేదని, ప్రత్యేకించి రాష్ట్రంలో గడిపితే బాగుంటుందని అయన తెలిపారు. ఆంద్ర రాష్ట్రం నుండి పెట్టె ఎలాంటి బిల్లులని ఆయన పట్టించుకోవడం లేదని, నరసింహం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ అని తెలంగాణకి మాత్రమే కాదని ఆంద్ర ప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ ఏంటి అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.