VIZAGVISION:Jallikattu in Tamil Nadu….తమిళనాడు వ్యాప్తంగా పొంగల్ సంబరాలు అంబరాన్నంటాయి. పొంగల్ సందర్భంగా సంప్రదాయబద్దమైన జల్లికట్టు నిర్వహిస్తున్నారు. జల్లికట్టు పోటీలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. పాలమేడులో నిర్వహించిన జల్లికట్టు పోటీలను వేలాది మంది తిలకరించారు. పోటీలను చూడటానికి వచ్చిన 19 ఏళ్ల యువకుడిని ఎద్దు కొమ్ములతో పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఎద్దులు మీదికి దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో అటు జల్లికట్టులో పాల్గొన్న యువకులతో పాటు, చూసేందుకు వచ్చిన 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.