VIZAGVISION:ongole bulls race competitions,Krishna Dist..దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు ,డాక్టర్ రాజశేఖరరెడ్డి లు ఇద్దరూ
నాయకులు అంధ్రప్రదేశ్ లో ఒ ప్రభంజనం అని వారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి మొదటి కార్యక్రమం గా సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగురోజులు ఒంగోలు జాతి ఎడ్లు బండ్ల లాగుడు పోటీలు విజయవంతంగా ముగిసినాయని దానికి కారణం రైతులు ప్రజల తో పాటు దీవంగత నేతలు డా. వై యస్ రాజశేఖరరెడ్డి మరియు నందమూరి తారక రామారావు గారి ఆశ్సీస్సులు అని ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు అని శాసన సభ్యులు కొడాలి నాని అన్నారు
కృష్ణా జిల్లా గుడివాడ లో యన్ టి అర్ టూ వైయస్సార్ పేరు మీద ట్రస్ట్ పెట్టి మొట్టమొదటి కార్యక్రమం గా ఒంగోలు జాతి ఎడ్లు బండ్ల లాగుడు పోటీలు కి రాష్ట్రంలో ఉన్న పశుపోషకులు అధిక సంఖ్యలో వచ్చి ఈ పోటీలు లో పాల్గోన్నారు
ఈ రోజు ఆఖరి రోజు సీనియర్స్ విభాగం లో 10 జతల ఎడ్లు పాల్గోన్నయి ఉదయం శాసన సభ్యులు కొడాలి నాని కుమార్తెలు ఈ పోటీలు లను ప్రారంభించారు
హోరాహోరీగా జరిగిన ఉత్కంఠ పోరులో గన్నవరం కి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రిడింగ్ బుల్ సెంటర్ కి చెందిన ఎడ్లుకు ప్రధమ బహుమతి కింద లక్షరూపాయలు గెలుచుకున్నాయి రెండవ స్దానం లో గుంటూరు జిల్లా పెద కాకానికి చెందిన ఎడ్లకు మూడవ స్దానం లో విజయవాడ గుణదల కి చెందిన ఇందిరా ఫుడ్స్ ఎడ్లు కైవసం చేసుకున్నాయి
విజేతలైన ఎడ్లు కు రైతులు ను నగదు బహుమతి తో సత్కరించారు
సంక్రాంతి పండుగ రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి చూడటానికి ప్రజలు మహిళలు రైతులు ,యన్ టి అర్ ,వైయస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున రావటంతో అ ప్రాంతమంతటా కోలాహలంగా మారిపోయింది సూమారు 2కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది…