భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో ఇవాళ సంక్రాంతి మిలన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరాని, విజయ్ గోయల్, జితేంద్ర సింగ్, జయంత్ సిన్హా, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎంపీ కేకే తదితరులు హాజరయ్యారు.