“అలా నేను ఇలా నువ్వు”
పర్సనల్ హోమ్ థియేటర్ ఓనర్స్ కి వినోదం అందించటమే లక్ష్యంగా ప్రారంభమైన హెచ్‌టిఓ క్లబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి హోమ్ థియేటర్ సినిమాను లాంఛనంగా విశాఖలో ప్రకటించింది. రాజ్ కందుకూరి సమర్పణలో వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ నిర్మాణంలో వి.ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి “అలా నేను ఇలా నువ్వు” అనే టైటిల్ ఖరారు చేసారు.
జనవరి 26న వాల్తేర్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు మరియు విద్యాశాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరిలో ప్రముఖ నేపధ్య గాయకులు నిహాల్ మరియు బృందం తమ పాటలతో అలరించారు. సూర్యకాంతం హాస్యవేదిక అనే పేరుతో నిర్వహించిన హాస్యోత్సవంలో హాస్యకళాకారులు ప్రేక్షకులను తమ స్కిట్స్‌తో ఆకట్టుకున్నారు.
కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ లవ్, యాక్షన్ కూడా అంతే స్థాయిలో ఉండే ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించబడుతుంది. సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ సినిమాకి ప్రముఖ నేపథ్య గాయకులు నిహాల్ సంగీతం సమకూర్చనున్నారు.
జనవరి 27న జరిగిన పత్రికా సమావేశంలో చిత్ర సమర్పకులు రాజ్ కందుకూరి, నిర్మాత వీరశంకర్, సంగీత దర్శకులు నిహాల్, డి ఓ పి సంతోష్ శానమోని, రచయిత మురళీధర్, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు
సమర్పణ: రాజ్ కందుకూరి, కథ – కథనం – నిర్మాత : వీరశంకర్, దర్శకత్వం: వి.ఎన్.ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శ్రీరామ్ తాడేపల్లి, నాగమహేష్ వడ్డి, సంగీతం: నిహాల్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శానమోని, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, రచనా సహకారం: ఎన్.ఎన్.మురళీధర్, మాటలు: మోహన్, వంశీధర బత్సు, ఆర్ట్: వెంకట్ సన్నిధి, కో-డైరెక్టర్: దిలీప్ పోలన్