Vizag Vision:Appikonda Someswara kshastram Maha shivratri festival,Visakhapatnam..విశాఖ పెదగంట్యాడ మండలం
అప్పికొండ గ్రామం. దేవాలయాలో అతిపురాతన దేవాలయం అయినా అప్పికొండ సోమేశ్వర క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవానికి , విశాఖ నుండి 45 కిలో మీటర్లు దూరంలో ఆలయం వుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో దానికి తగ్గట్టూగే ఏర్పాట్లు చేస్తున్నారు , చోళ రాజులు కాలం నాటి ఈ దేవాలయం కు ఏంతో విశిష్టత కలిగి ఉంది , ఉత్తరాంధ్ర లోనే అతిపురాతనమైన మహిమగల ఆలయంగా చెప్పవచ్చు సోమేశ్వర క్షేత్రంలో ప్రతి శివరాత్రికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున ఆచారం .మహాశివరాత్రి రోజున రాత్రి అంతా జాగారం ఉండి, తెల్లవారు జామున సముద్ర స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే ఏంతో పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం , ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ఒక్క వైపు సముద్రం మరో వైపు ఆహ్లదకర వాతావరణం మరో ఎతైన కొండలు ఇక్కడి ప్రత్యేకత , లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు కోసం దేవాదాయధర్మాదాయ శాఖ అదికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది, తాగేందుకు మంచి నీరు సరఫరా జీవీఎంసీ ఉచితం గా చెయ్యునుంది , సముద్ర వొడ్డున బట్టలు మార్చుకునేందుకు ఆరు గదులను ఏర్పాటు చేసారు , ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారని దేవాలయం ఈ ఓ తెలిపారు