Vizag Vision:ACB Rides on Surveyor of mines 50,ooo/-Visakhapatnam…విశాఖలో గనులు మరియు భూగర్భ శాఖకు చెందిన ఓ సర్వేయర్ 50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులను చిక్కాడు. ఎంవిపికాలనిలోని శాఖ సహాయ సంచాలకుని కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న సర్వేయర్ డి. మురళీకృష్ణ అంబేద్కర్ పరవాడ మండలం రావాడ గ్రామంలో 5 ఎకరాల భూమిలో క్వారీ తవ్వకాల కోసం భూమి యజమాని నీలకంఠం 2011వ సంవత్సరం లో దరఖాస్తు చేసుకున్నారు. తహశీర్ధార్ కార్యాలయం నుండి ఎన్ఓసి సర్టిఫికెట్ రాని కారణంగా.. దరఖాస్తు పెండింగ్ లో పెట్టారు. ఈనెల 28వ తేదీన మీ భూమి సర్వే కు వస్తున్నామని సర్వేయర్ అంబేద్కర్ ఫోన్ లో భూ యజమాని నీలకంఠం కు సమాచారం ఇచ్చి తనను సంప్రదించవలసిందిగా కోరాడు. ఈమేరకు నీలకంఠం విశాఖలో ఉన్న గనుల శాఖ కార్యాలయంలో సర్వేయర్ అంబేద్కర్ ను కలవగా గ్రాఫ్ సక్రమంగా లేని కారణంగా మీ దరఖాస్తును తిరస్కరించడం జరుగుతుందని .. 50 వేలు లంచంగా ఇస్తే అనుమతులు మంజూరు చేస్తామని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని నీలకంఠం అనిశా అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు సర్వేయర్ అంబేద్కర్ ను కలుసుకుని 50వేలు లంచం ఇచ్చాడు. అనంతరం అనిశా అధికారులు సర్వేయర్ అంబెడ్కర్ లంచం తీసుకుంతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచే 50 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అనిశా డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. అలాగే అనకాపల్లి లో ఉన్న అంబేద్కర్ ఇంటిపై కూడా అనిశా అధికారులు సోదాలు జరుపుతున్నారు.