పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు….జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన కుమారుడు లోకేష్ పై చేసిన ఆరోపణలకు తెలుగుదేశం నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు మొన్నటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు ఎన్నికలకు ముందు సంవత్సరమున నేపథ్యంలో పవన్ ఇలా మాట్లాడటం మంచిది కాదు భావ్యం కాదు అని అన్నారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మంచివాడుగా కనిపించిన తాను ఇప్పుడు చెడ్డవాడిగా అయిపోయానా? అని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించినందునే 40 ఏళ్లు రాజకీయంలో ఉన్నానని చంద్రబాబు అన్నారు.
తాను మూడు మాటల్లో ఆరు అసత్యాలు మాట్లాడతానని పవన్ విమర్శించారని అన్నిటికి సమాధానం చెప్తున్నా అని చెప్పారు.
ఇసుక విక్రయాలకు సంబంధించి ఎక్కడో చిన్నచిన్న పొరపాట్లు జరిగితే. మైనింగ్ స్కామంటూ గాలి జనార్దన్‌రెడ్డితో పవన్ ముడిపెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టమని అలాగే మెగా ఆక్వాఫుడ్ పార్క్ కాలుష్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుండి రావలసిన అన్ని విషయాలలో ఎక్కడా రాజీపడకుండా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే చేయొచ్చు గానీ ఇలా ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద బురద చల్లాలన్నుకోవడం మంచిది కాదని అన్నారు.