Vizag vision:AP CM Along With Family Members Sri Vengamamba Anna Prasad Hall,Tirupathi…ముఖ్యమంత్రి గారి మనుమడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు 21-3-18 న ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదం హాల్ చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, వారి కుటుంబ సభ్యులు
అన్న ప్రసాదం సేవకులు ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబ సభ్యులకు టిటిడి సేవా స్కార్ఫ్ ను గౌరవంగా సీఎం భుజాల చుట్టూ వేశారు
సీఎం, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు శ్రీవారి అన్న ప్రసాదం హాల్లో భక్తులకు అన్న ప్రసాదాలను భక్తిపూర్వకంగా వడ్డించి, భక్తులతో కలిసి అన్న ప్రసాదం సేవించారు
అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం, మనుమడు నారా దేవాన్ష్ తరఫున 26 లక్షల రూపాయల విరాళాన్ని డిడి రూపంలో శ్రీవారి అన్న ప్రసాదం సేవకోసం టిటిడి ఈఓ, తిరుమల జేఈఓ లకు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారి కుటుంబ సభ్యులు, మనుమడు దేవాన్ష్, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు.
పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ప్రజా ప్రతినిధులు, టిటిడి అధికారులు