Vizagvision:Young woman who fought death for about 12 hrs in Godavari Dist,..గోదావరి జిల్లా లో సుమారు 12గం ల పాటు మృత్యువు తో పోరాడిన యువతి..
భీమవరంలోని శ్రీ రాంపురానికి చెందిన జయంతి రాజేశ్వరి (21)…బి ఇ డి చదువుతుంది
గురువారం ఉదయం భీమవరం నుండి విజయవాడ కు వచ్చింది.
విజయవాడ నుండి గురువారం సాయంత్రం భీమవరం వెళ్ళాటానికి .పూరి.తిరుపతి ఎక్స్ప్రెస్ ఎక్కింది..
రాత్రి 9గం ల సమయంలో రైలు ఆకివీడు -గుమ్మలూరు మద్య లో ఉన్న రైల్వే గేటు సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్ పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోయింది .
పడిపోగానే జయంతి రాజేశ్వరి కి తలకి దెబ్బతగలటంతో సృహతప్పి పడిపోయింది.
రాత్రి సమయం కావడం తో అటువైపు జనసంచారం లేకపోవడం ఎవరు గమనించలేదు..
శుక్రవారం ఉదయం బురద గుంటలో పూర్తి కూర్కుని అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్వరి ని గుర్తించిన రైల్వే గేట్ మెన్..
రైల్వే అధికారులు కి స్దానిక పోలీసులు కి సమాచారం ఇచ్చి కార్మికులు సహయంతో రాజేశ్వరి ని బురదలో నుండి బయటకు తీసి హాస్పిటల్ కి తరలించారు…
యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక మరేదైనా జరిగిఉండవచ్చా అని పోలీసులు విచారణ..
వివరాలు చెప్పటానికి రాజేశ్వరి అపస్మారక స్థితిలో ఉండటంతో కోంచం కోలుకున్న తరువాత వివరాలు సేకరించనున్న పోలీసులు.