TDP MPs Protest Arrest MPs at PM Narendra Modi’s House in Delhi,Vizagvision..ఏపీకి న్యాయం చేయాలంటూ ఢిల్లిలో ప్రధాని ఇంటి వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో టీడీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రధాని ఇంటి ముందు రోడ్డుపై పడుకొని మాగంటి బాబు నిరసన తెలిపారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదంటూ స్వామివారి ఫొటోతో మాగంటిబాబు నిరసన తెలిపారు.