సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా ప్రమాణ స్వీకారం…
ఇందూ మల్హోత్రా ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 61 ఏళ్ల ఇందూకు న్యాయశాస్త్రంలో విశేష అనుభవం ఉన్నది. కొలీజియం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం వెలువరించిన ఉత్తర్వుల మేరకు చీఫ్ జస్టిస్ మిశ్రా ఆమే చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందూ మల్హోత్రా 2007 నుంచి సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు జడ్జి పదవికి ఇందూమల్హోత్రా, ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసఫ్ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందూమల్హోత్రా పేరును మాత్రమే ఖరారు చేసింది. జస్టిస్ కేఎం జోసఫ్ పేరును తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదంతో ఇందూ మల్హోత్రాను సుప్రీంకోర్టు జడ్జీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది