దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్లో రెండు ఫొటోలను పోస్ట్ చేసి గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. అందులో పై నున్న ఫొటోలో తాను తీసిన మొట్టమొదటి సినిమా శివ కు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండగా, కింది ఫొటోలో తాజాగా నాగార్జునతో తీసిన ఆఫీసర్ సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. శివ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా గుణశేఖర్, కృష్ణవంశీ, తేజ, ఉత్తేజ్, ఫణిలు ఉన్నారు. రామ్గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో వస్తోన్న ఆఫీసర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నాగార్జున్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్గా మైరా సరీన్ నటిస్తోంది