YSRCP Padayatra in Gajuwaka,Vizag Vision…రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని,ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. నగరం లో ఆయన చెప్పట్టిన సంఘీభావ యాత్ర రెండవ రోజు న గాజువాక లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు జన రంజక మైన పాలన అందించాలనే లక్ష్యంతో తమ పార్టీ అధ్యక్షులు యువ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి నవరత్నాలు ప్రకటించిన సంగతి విదితమే అన్నారు. నవరత్నాల కు మరింత పదును పెట్టాలనే లక్ష్యంతో ప్రజల నుండి సూచనలు సలహాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. యువ నేత పాదయాత్రకు సంఘీభావంగా తాను నగరం లో పాదయాత్ర చేపడుతున్నను అన్నారు. నగరం లో పార్టీ ని పటిష్ట పరచడం తో పాటు నవరత్నాల ను ప్రజలకు వివరించడం లక్ష్యం గా తన పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రెండవ రోజు పాదయాత్ర గాజువాక జగ్గు జంక్షన్ నుండి వు డా కోలనీ నేల్లీముక్కు , నడుపూరు దయాళ్ నగర్ మీదుగా నాగిరెడ్డి ఇంటికీ చేరుకుని అక్కడ మద్యాహ్నం విరామం .కార్యక్రమం లో విజయ సాయి రెడ్డి వెంట నగర పార్టీ అధ్యక్షులు డాక్టర్ మళ్ల విజయ ప్రసాద్, విశాఖపట్నం,అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు తైనాల విజయకుమార్,గుడివాడ అమర్నాథ్,వరుదు కల్యాణి , రాష్ట్ర బిసి విభాగం అద్యక్షులు జంగా కృష్ణ మూర్తి , గాజువాక నియోజక వర్గ సమన్వయ కర్త తిప్పల నాగిరెడ్డి, సమన్వయ కర్తలు పసుపులేటి ఉషాకిరణ్,రామ కృష్ణారెడ్డి, అదీఫరాజు పార్టీ నాయకులు పక్కి దివ్వకర్,రవి రెడ్డి, రామన్నపాత్రుడు , శ్రీనివాస్ గౌడ్ పూర్ణ శర్మా తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది పార్టీ కార్య కర్తలు, నాయకులు వెంట రాగ హుషారుగా విజయ సాయి రెడ్డి తన సంఘీభావ యాత్రను కొనసాగించారు.