Congress party president Rahul Gandhi said BJP will not come to power in the next general elections Modi becomes PM,Vizagvision..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదని, మోదీ మళ్లీ ప్రధాని కావడం కూడా అంతే అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
లిబరల్, సెక్యులర్, రిపబ్లికన్ విలువలను ప్రమోట్ చేసేందుకు ఉద్దేశించిన ‘సమృద్ధి భారత్ ఫౌండేషన్’ ప్రారంభోత్సవంలో రాహుల్ మంగళవారంనాడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెంగళూరు పౌరులతో రాహుల్ ముఖాముఖీ మాట్లాడారు.
2019 లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తే మీరు ప్రధాని అవుతారా అని అడిగినప్పుడు ‘యస్…ఎందుకు కాకూడదు?’ అని రాహుల్ నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంత బాగా పనిచేస్తుందనే దానిపైనే అది ఆధారపడి ఉంటుందని, అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తే…అందుకు (ప్రధాని కావడం) అవుననే చెబుతానని అన్నారు.
వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్రధాని పదవికి మోదీ తిరిగి ఎన్నికయ్యే ప్రసక్తే లేదని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
‘తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయడం అసాధ్యం. మోదీ మళ్లీ ప్రధాని కావడం కూడా అంతే అసాధ్యం’ అని ఆయన అన్నారు.