ఉత్తరాఖండ్లో భారీ మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేదార్నాథ్కు వచ్చిన యాత్రికులు, భక్తులు మంచు తుఫాను కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ ప్రదీప్ ఉన్నారు. గౌరికుంద్కు వెళ్లే దాదాపు 4,200 మంది యాత్రికులు మంచు తుఫాను కారణంగా కేదార్నాథ్లో చిక్కుకుపోయారని రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ తెలిపారు. వీరిలో 400 మందికి పైగా వృద్ధులు ఉన్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ జవాన్లు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఐదు ఇంచుల మేర మంచు కురుస్తుండటంతో హెలికాప్టర్ సేవలు, యాత్రికుల కదలికలు నిలిచిపోయాయన్నారు. కాగా ఈ రోజు వాతావరణం అనుకూలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ మంచు వాతావరణం దాటికి తట్టుకోలేక మంగళవారం ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ముంబయి, ఢిల్లీకి చెందిన ఇద్దరు యాత్రికులు గుండెపోటుతో మృతిచెందగా.. ట్రెక్కింగ్ చేస్తున్న నేపాలీ పోర్టర్ మంచుచరియలు విరిగి మీదపడటంతో చనిపోయాడు