ఇవాళ, రేపు బ్యాంకులు బంద్….ఇవాళ, రేపు ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్ పాటిస్తున్నాయి. వేతన సవరణ డిమాండ్ తో.. దేశమంతటా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. బుధ, గురు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు.. కొన్ని ప్రైవేటు బ్యాంకులు పనిచేయవు. ఆన్ లైన్ లావాదేవీలు యధావిధిగా జరుపుకోవచ్చని అధికారులు చెప్పారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలితం ఇవ్వలేదన్నారు…బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు. తెలుగు రాష్ట్రాల్లో 80వేల మంది అధికారులు, ఉద్యోగులు ఈ సమ్మలో పాల్గొంటారని తెలిపారు.