ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి..గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు హెచ్చరిక. ఈ జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లాలోని కాకుమాను, పెదకాకాని, దుగ్గిరాల, తాడేపల్లి, చేబ్రోలు, తాడికొండ, బొల్లాపల్లి, దుర్గి, కారంపూడి, ఈపూరు ప్రాంతాలలో పిడుగు పడే అవకాశం ఉంది.
కృష్ణా జిల్లాలోని కైకలూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరులో..
ప్రకాశం జిల్లాలోని అద్దంకి..
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో పిడుగులు పడే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది