మంగళవారం జరిగిన కార్యనిర్వహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘పార్టీ తమ నేతను కోల్పోయింది. కానీ నేను నేతతో పాటు నా తండ్రినీ కోల్పోయాను.
కలైంజ్ఞర్ చివరి కోరిక ప్రకారం ఆయన అంత్యక్రియలు మెరీనా బీచ్లో నిర్వహించాల్సిందిగా సీఎంను చేతులు పట్టుకొని కన్నీటితో వేడుకున్నాను.
కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. కానీ కోర్టు మాత్రం అందుకు అంగీకరించింది.
చనిపోయినా కూడా ఆయన పోరాటంలో విజయం సాధించారు.
మెరీనా బీచ్లో కలైంజ్ఞర్ అంత్యక్రియలు జరిగాయంటే దానికి కారణం న్యాయవాదులే’ అని స్టాలిన్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
కరుణానిధి లేకపోయినా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఓటమిని అధిగమిస్తానని ఆయన చెప్పారు.
కార్యక్రమం ప్రారంభం కాగానే డీఎంకే నేతలందరూ అధినేత ఎం.కరుణానిధికి నివాళులర్పించారు.
డీఎంకే పార్టీ పగ్గాలు స్టాలిన్ అందుకుంటారనుకునే తరుణంలో బరిలో తానూ ఉన్నానని సంకేతాలు ఇచ్చారు
కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి. డీఎంకే నేతలు మాత్రం స్టాలిన్ అయితేనే పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో స్టాలిన్ను డీఎంకే అధ్యక్ష పదవికి ప్రతిపాదించే అవకాశం ఉంది.
అధ్యక్ష పదవికి ఇక ఎవరూ పోటీ పడలేరని డీఎంకే ప్రిన్సిపల్ సెక్రటరీ దురైమురుగన్ తెలిపారు.