సురేష్ బాబు,విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ మల్టీస్టార్రర్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘పవర్’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘జై లవకుశ’ వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వం వహించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే..ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది కానీ…ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో ‘వెంకీ మామ’ ఆగిపోయిందనే టాక్ ఊపందుకుంది.
ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు.వెంకటేష్ నటిస్తున్న ‘ఎఫ్ 2’ చిత్రం పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం అవుతుందని.. ప్రస్తుతానికి ‘వెంకీ మామ’ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.