బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు
దేశంలోని వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి
భవిష్యత్తు తరాల సంక్షేమం కోసమే నిర్ణయం
సంయుక్త మీడియా సమావేశంలో మన చంద్రబాబు
భాజపా యేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది.
దిల్లీకి వెళ్లిన చంద్రబాబు జాతీయ స్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.
పవార్‌తో పాటు ఫరూక్ అబ్దుల్లాతోనూ భేటీ అయ్యారు.
సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలతో పాటు వివిధ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న దాడులపై చర్చించారు.
సీబీఐ, ఆర్బీఐ వంటి కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం తదితర అంశాలపై ముగ్గురు నేతలూ కలిసి చర్చించారు.
*భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో చంద్రబాబు కామెంట్స్*
శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా ఎంతో గొప్ప నేతలని, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో వారితో చర్చించినట్లు చెప్పారు.
దేశంలోని వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తంచేసిన సీఎం చంద్ర బాబు
వాటిని సరిచేయడమే లక్ష్యమన్నారు.
మిగతా పార్టీల నేతలతోనూ కలిసి మాట్లాడతామని, భాజపా యేతర పార్టీలతో కలిసి ముందుకు నడుస్తామని స్పష్టం చేశారు.
భవిష్యత్తు తరాల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
భాజపాకు వ్యతిరేకంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.
భాజపా వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగడుతున్నామని, తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ పనిచేస్తామని వెల్లడించారు.
*శరద్ పవార్ కామెంట్స్*
ప్రసస్వమ్యాన్ని కాపాడటమే లక్ష్యం
ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
వివిధ పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు జరుపుతామని తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
*ఫరూక్ అబ్దుల్లా..*
దేశంలో క్లిష్ట పరిస్థితులు
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందోని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తంచేశారు.
ఇందుకు సీబీఐ, ఆర్బీఐ వివాదాలే ఉదాహరణ అన్నారు.
ఈ తరుణంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భాజపాయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.
కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తామన్నారు.
దీనిలో భాగంగా వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతారని అన్నారు.