. విశాఖలో భూ వ్యవహారంపై అఖిల పక్షం పిడికిలి బిగిస్తోంది…విశాఖాను కుదిపేస్తున్న భూ దందాలపై మహాధర్నాకు అఖిలపక్షాలు సిద్దమవుతున్న సమయంలో భూ భాదితులను నేరుగా కలిసేందుకు మరో ముందడుగు వేశారు…విశాఖలో వెలుగు చూస్తున్న భూ వ్యవహారంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అఖిలపక్షాలు ముదపాక భూములను పరిశీలించేందుకు తరలి వేళ్లారు…వైకాపాతో పాటుగా సిపిఎం,సిపిఐ , లోక్ సత్తా పార్టీ నేతలు తరలి వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడారు…అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతలు ప్రభుత్వ భూములతో పాటుగా రైతుల భూములను అప్పనంగా కాజేందుకు ప్రయత్నించారని వైకాపా నేతలు ఆరోపించారు…రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు…రైతులకు భరోసా ఇచ్చేలా అఖిల పక్షం నేతలు ముదపాక భూములను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ … ల్యాండ్ పూలింగ్ పేరుతో వెంటకరామరాజు అనే వ్యక్తి రైతుల నుంచి భూములను స్వాదీనం చేసుకునేందుకు అనుకూలమైన జీవోను తెచ్చుకునేందుకు యత్నించారని , ఇదే కాకుండా దీనిపై తమతో మంతనాలు కూడా జరిపినట్లు వైకానా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆరోపించారు…ల్యాండ్ పూలింగ్ తక్షణమే ఆపాలని , జీవో 304 కూడా వెంటనే రద్దు చేయ్యాలని డిమాండ్ చేశారు.