నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చి ఇండస్ట్రీ లో తన అదృష్టాన్ని పరిక్షించుకున్న తారకరత్న నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సస్ కాలేకపోయాడు.హీరోగా అనేక చిత్రాలలో నటించిన ఒక్క హిట్ కూడా లేకపోవడంతో క్రమక్రమంగా తన కెరీర్ క్లైమాక్స్ స్టేజ్ కి చేరుకుంది.ఇక ఒకప్పుడు హీరోగా నటించిన తారకరత్న ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నాడు అయిన కూడా ఇండస్ట్రీ లో ప్రేక్షకుల మనసులో మంచి ఇమేజ్ ని సంపాదించుకోలేకపోయాడు.అయితే కొన్ని సంవత్సరాల క్రితం తారకరత్న పెద్దలకు ఇష్టం లేకుండా అలేఖ్య రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు. దాంతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు.అటు అలేఖ్య సైతం తల్లిదండ్రులకు దూరంగా ఉంటుందని వారి సన్నిహితులు చెప్తుంటారు..ఇది ఇలా ఉంటె సినిమాలలో ఎటువంటి ఆఫర్స్ లేకపోవడం వాళ్ళ తారకరత్న కు ఆర్ధికంగా సాయం చేస్తుంది టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ అని కొందరు చెప్తూ ఉన్నారు.తారకరత్న కు వరసకు తమ్ముడు అయిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన సోదరిడితో సినిమా చేస్తూ అతనికి ఆర్ధిక ఇబ్బందులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు గతంలో వార్తలు వినిపించాయని సమాచారం.ఇక తారకరత్న ఆర్ధిక ఇబ్బందులకు ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ లక్షలు లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తుంది.అసలు ఈ విషయం ఎలా బయటకి వచ్చింది అని అనుకుంటే స్వయంగా తారకరత్న నే తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయం బయట కానీ ఇంట్లో కానీ ఎవరికీ చెప్పొద్దూ అని ఎన్టీఆర్ తారకరత్న కు చెప్పాడట.మొత్తానికి తన బ్రదర్స్ బాగోగులను ఎన్టీఆర్ బాగా చుసుకున్తున్నట్లు తెలుస్తుంది..