Metro Train Coming to Visakhapatnam,Vizagvision….విశాఖ మెట్రో కు నోటిఫికేషన్ జారీ …..వ్యయం 13వేల కోట్లు…మూడు కారిడార్లలో 42.55కిలోమీటర్ల మేర ఏర్పాటు…గాజువాక నుంచి కొమ్మాది వరకు….కొత్త కారిడార్…గురుద్యార్ నుంచి పాత పోస్టాఫీస్ రెండో కారిడార్…తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ మూడో కారిడార్… విశాఖ లో మెట్రోరైలు పట్టలేక్కనుంది…దీనికి ప్రాజెక్టు అంచనా వ్యయం 13.488 రూపాయల కోట్లుగా వుంది. మెట్రోరైలు వస్తే ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. నగరంలో ఇప్పటికే రామాటాకీస్, సిరిపురం, జగదాంబ, ద్వారకానగర్ తదితర ప్రాంతాలలో రోడ్లను డివైడర్లతో మూసివేయడం తెలిసిందే. కాగా, మెట్రోరైలుకి అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ (యూఎంటీసీ)సంస్థకన్సల్టెంట్వ్యవహరిస్తుంది.పీపీపీవిధానంలోనిర్మాణానికికేంద్ర,రాష్ట్ర్రప్రభుత్వాల అంగీకారం తెలిపాయి.మూడు కారిడార్లు కింద మొత్తం 42.55 కిలోమీటర్లు పొడుగున ఈ మెట్రోరైలు వస్తుంది. 1వ కారిడార్ గాజువాక నుంచి ఎన్.ఏడి జంక్షన్, గురద్వార్ మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా పాతపోస్టాఫీస్ వరకు 5.25 కిలోమీటర్ల మేరకు వుంటుంది. 3వ కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి ద్వారకాబస్ స్టేషన్, సిరిపురం మీదుగా పార్క్ హూటల్ వరకు 5.25 కిలోమీటర్ల మేరకు వుంటుంది. టెండర్లు, ఇతర ప్రక్రియల పూర్తికి 8 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నారు.ఇక ఈ ప్రాజెక్ట్ కు గాను భూసేకరణ బాధ్యత జిల్లాయంత్రాంగంకి అప్పగించారు. రాష్ట్ర్రప్రభుత్వం 20 శాతం, కేంద్రం 20శాతం మొత్తం గ్రాంటు రూపంలో మెట్రోరైలు వ్యయం భరిస్తారు. ప్రయాణీకుల రాకపోకలు, వాహనాల రద్దీ, వంటి విషయాలను ఇప్పటికే అధ్యయం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టుకె ఐదెకరాల స్థలం అవసరం అని అంచనా వేశారు. అలాగే ఈ మార్గంలో 42 స్టేషన్లు వుంటాయి. పై వంతెన మార్గంలో రైలు వెళుతుంది. నాలుగు సంవత్సరాలలో మెట్రోల రైలు నిర్మాణం పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.ఇక మెట్రోరైలులో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏదిఏమైనా మెట్రోరైలు కారణంగా విశాఖలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తగ్గుతాయని బావిస్తున్నారు అంతా..