ACB Ride Public Health Dept.Chief Engineer Dr.Panduranga rao.V Visakhapatnam,Vizagvision….ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ డాక్టర్ పాండురంగారావు ఇంట్లో ఏసీబీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. విజయవాడలో రెండుచోట్ల, గుంటూరు, హైదరాబాద్, ప.గో జిల్లాలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఎసిబి అధికారులు దాడులు చేసి సోదా చేయగా అక్రమాస్తులకు సంబంధించి డాక్యుంమెట్లు బయటపడ్డాయి. అదేవిధంగా విశాఖలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ బాబు విజయకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పాండురంగారావు, విజయ్‌కుమార్‌లు వ్యాపార భాగస్వాములుగా గుర్తించారు. విశాఖలో 8 చోట్ల సోదాలు, రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల సోదాలు ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.