ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ఉన్న సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం పాలయ్యాడు.దీనికి కారణం కారుని అతివేగంగా డ్రైవ్ చెయ్యడమే అని తెలుస్తుంది. 125 కిలోమీటర్ల వేగంతో స్కోడా కారు నడుపుతున్న భరత్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శంషాబాద్ నుండి గచ్చిబౌలీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
కాగా… ఈ ప్రమాదాన్ని భరత్ స్నేహితులు గోప్యంగా ఉంచారు. ప్రమాదవార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి రవితేజ సోదరుడు భరత్‌గా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ కార్ రవితేజ తల్లి రాజ్య లక్ష్మి పేరిట రిజిస్టర్ అయ్యి ఉంది.అయితే ఈ ప్రమాదం రాత్రి 10 గంటల సమయంలో చోట చేసుకుందని స్థానికులు తెలిపారు.