రాజకీయ పార్టీలు క్రైస్తవ సంస్థలపై దాడులు ఆపాలి ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ లీడర్స్ ఫారం డిమాండ్ Visakhapatnam.. క్రైస్తవమిషనరీ విద్యాసంస్థలు ఇంగ్లీష్ మీడియం బోధించడం ద్వారా ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ లీడర్స్ పోరం
(ఏపీసి ఎల్ఎఫ్) రాష్ట్ర చైర్మన్ ఆలివర్ రాయి అందించారు ఖండించారు. శుక్రవారం వి జి ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు హిందీ సంస్కృత భాషల పాఠ్యపుస్తకాలలో ప్రధానంగా ఉండేది హైందవ మత గ్రంధాల పాఠ్యాంశాలేనని ఇవి మాకు ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని అన్నారు. ఇంగ్లీషు భాష పాఠ్యపుస్తకాలలో క్రైస్తవ మత ఆధారిత పాటలు ఎక్కడ ఉండవని. తెలిపారు. ఇంగ్లీష్ మాధ్యమంలో చదవడం ప్రచారం క్రైస్తవ మత ప్రోత్సాహం అనటం అవివేకానికి నిదర్శనమన్నారు. రాజకీయ నాయకులు స్వలాభం కోసం మత ప్రస్తావనలు లేవనెత్తి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ కలసిమెలసి ఉన్నప్పటికీ మతసామరస్యాన్ని చేయడానికి మత శక్తులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. క్రైస్తవ విద్యాసంస్థలు, మిషనరీలు సేవా దృక్పథంతో అన్ని వర్గాల ప్రజల కోసం సేవా దృక్పథంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోకపోతే క్రైస్తవుల రక్షణ కోసం న్యాయస్థానంలో కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు డి.ఎస్ వి.ఎస్. కుమార్, విన్సెంట్, రవిబాబు, సమర్పణ రాజు, బిల్లీ గ్రహం, విల్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు.