శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ-సీ47 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగానికి ఉదయం 7.28 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు.
కౌంట్‌డౌన్ ప్రక్రియ 26 గంటల పాటు కొనసాగనుంది.
రేపు ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ47 వాహకనౌక మోసుకెళ్లనుంది.
కార్టొశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
కార్టొశాట్3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టొశాట్-3ని రూపొందించింది.
1,625 కిలో బరువున్న కార్టొశాట్-3 జీవితకాలం ఐదేళ్లపాటు సేవలందించనుంది.
ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది