President Of India BJP Ramnath Kovind.Vizagvision..రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్‌నాథ్ కోవింద్‌కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌పై ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్‌నాథ్‌కు 7,02, 644, మీరాకుమార్‌కు 3,67, 314 ఓట్ల విలువ వచ్చాయి. ఈ నెల 25న కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అలాగే కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.