Vizagvision: Mudragada House Arrest Kirlampudi…కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ సంఘటనలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో ముద్రగడను 24 గంటల పాటు గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని.. దీంతో ఆయన్ని సెక్షన్ 151 పీఆర్సీసీ కింద నిర్బంధించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను ముద్రగడకు వివరించగా.. ఆయన గృహానికే పరిమితమయ్యేందుకు ఒప్పుకున్నారని వెల్లడించారు.మరోవైపు ముద్రగడకు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి కాపు నేతలు, యువకులు పెద్దయెత్తున కిర్లంపూడికి తరలివస్తున్నారు.పోలీసులు వారందరినీ పట్టణ శివారులోనే అడ్డుకుని తిరిగి పంపించి వేస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. కిర్లంపూడికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు.