New Executive Committee was Sworn by Event Managers Association (EMA) in Visakhapatnam,Vizagvision మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో గడిచిన 20 ఏళ్లుగా ఈవెంట్ ఇండస్ట్రీలో దిగ్గజాలు గా వెలుగొందుతున్న ఈవెంట్ మేనేజర్లు తమ
ఈ మా సంస్థకు తాజాగా ఎన్నికలు నిర్వహించారు. covid 19 నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం ఎన్నికలు చేపట్టి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 20 20 సంవత్సరపు అధ్యక్షునిగా రవిశంకర్ ,కార్యదర్శిగా ఉదయ్ హరీష్ లతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా దాబా గార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.అనంతరం అధ్యక్షుడు రవిశంకర్ మాట్లాడుతూ కరోనా ప్రభావంతో గడిచిన ఆరు నెలలుగా ఈవెంట్ ఇండస్ట్రీకి చెందిన టెక్నీషియన్ కళాకారులు వేలాది మంది ఉపాధి లేక సంక్షోభంలో పడి కొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. ఈవెంట్ మేనేజర్లు అసోసియేషన్ విశాఖపట్నం చాప్టర్ తరఫున తమవంతు చేయూత అందించేందుకు సిద్దం అవుతుందని ఆయన తెలిపారు.సమావేశంలో సందీప్ కుమార్, అరుణ్ కుమార్, షరీఫ్ ఖాన్, శ్రీకాంత్,షేక్ హసీనా, రాజు, అలక్ జాజు లు పాల్గొన్నారు