Container Truck Overturns on National HighWay | జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా in Visakhapatnam,Vizagvision
జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా …..విశాఖ కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది.
ప్రమాదానికి సంభందించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఐరన్ “రోల్ ” లోడ్ తో ఒరిసా నుండి విశాఖ పోర్ట్ కు వెళ్తున్న కంటైనర్ లారీ కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారి వద్ద కి వచ్చే సరికి అదుపు తప్పి ఒక్క సారిగా రహదారిపై బోల్తా పడింది . అయితే ప్రమాదంలో ప్రాణహాణి లేకపోవటంతో అంత ఊపిరి పిల్చుకున్నారు . వేకువజాము కావడం జనసంచారం అంతగా లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది .
నిద్ర మత్తె ప్రమాదానికి కారణం కావచ్చని స్థానికులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమిక్షించారు .