హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. భాదితుల కుటుంబాలకు మంత్రి శ్రీ.ముత్తంశెట్టి. శ్రీనివాస రావు గారు పరామర్శించారు.. ఈ మేరకు మంత్రి గారు మాట్లాడుతూ మృతి చెందున కుటుంబాలలో శాశ్వత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నియమాల ప్రకారం వారి కుటుంభం లో ఎవరికైనా ఉద్యోగ అవకాశం కల్పించటం జరుగుతుంది అన్నారు. ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్లకు రూ.50 లక్షలు మరియు కాంట్రాక్ట్ బేస్ కింద తాత్కాలిక ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు ఈ దుర్ఘటన జరగటం చాలా బాధ కరం, ప్రభుత్వం తరపున కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియపరుస్తున్నాం అని అన్నారు. ఈ విధంగా వాళ్లకు న్యాయం చెయ్యటం చాలా సంతోషకరం అని చెప్పారు. అదే విధంగా ఈ సంఘటన పై వెంటనే స్పందించినందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి యూనియన్ వర్కర్స్ అందరూ ఋణ పడి ఉంటానని తెలిపారు..అలాగే మొట్టమొదటి సారిగా ఈ విధమైన భారీ అగ్రీమెంట్ వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ భాదితులకు న్యాయం జరగడంలో చాలా సంతోషకారమని చెప్పారు.. ఈ కార్యక్రమంలో గాజువాక ఎం.ఎల్.ఎ తిప్పలు నాగి రెడ్డి గారు, జేసీ గారు, ఆర్.డి.ఓ గారు, షిప్ యార్డ్ కంపెనీ చైర్మన్ సీఎండీ గారు, మంత్రి రాజ శేఖర్ గారు, వైసీపీ నాయకులు బద్రి గారు, మరియు ట్రేడ్ యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.