VIZAGVISION: Fire Accident on Simhagiri Hill.Visakhapatnam…విశాఖ సింహాచలం సింహగిరిపై అగ్నిప్రమాదం. అధికారుల అప్రమత్తతతో తగ్గిన ఆస్తి నష్టం. అప్పన్న కేసకండనశాల ప్రక్కనే ఉన్న ఆరు దుకాణాలు టోపీలు , ఫోటోఫ్రేమ్స్ వస్త్రాలు ఇతర వస్తు సామాగ్రి మంటలకు ఆహుతయ్యాయి. సుమారు ముడులక్షలు ఆస్తినష్టం కిలిగింది. ఐతే దేవస్థానం అధికారులు , స్థానిక భక్తులు అప్రమత్తమయ్యి మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది, ఈ రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో షాపు యజమానులు ఉదయాన్నే షాపులు తెరిచి వ్యాపారం చేసుకుని మధ్యాహ్నానికి షాపులను మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు ఐతే సుమారు ఐదు గంటల సమయంలో షాపులనుండి పొగతో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు , భక్తుల సాయంతో మంటలను అదుపుచేశారు. అప్పటికే ఎనభై శాతం వరకు సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర ఏ ప్రమాదం వల్ల జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.