Central Government Should immediately Pay Bonuses to Railway Workers Demands Rail Mazoor Union in Visakhapatnam,Vizagvision…
రైల్వే కార్మికులకు కేంద్రప్రభుత్వం బోనస్ లు తక్షణమే చెల్లించాలి
ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్డూర్ యూనియన్ వాల్తేర్ డివిజన్ అద్యక్షుడు చలసాని గాంధీ, పీజేజే రాజు అధ్వర్యములో రైల్వే ఎంప్లాయిస్ కు ఈ ఏడాది ఇవ్వవలసిన బోనస్ లు వెంటనే ఏర్పాటు చేయాలని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ విశాఖపట్నం డాబాగార్డెన్ లో విలేకరుల సమావేశంనిర్వహించారు .ఈ సమావేశంలో చలసాని గాంధీ మాట్లడుతూ రైల్వే కార్మికులకు 1979 చరణ్ సింగ్ ప్రభుత్వం నుంచి దసరా కు బోనస్ లు ప్రతి ఏడాది తప్పనిసరిగా ఇస్తున్నారని, కరొన సమయములొ కుడా రైల్వే ఎంతో ఉత్పత్తి సాధించిందని ,కానీ రైల్వే మంత్రి రైల్వే ఎంప్లాయిస్ కి 2019 ఎప్రిల్ నుంచి మార్చి వరకు ఈ ఏడాది బోనస్ లూ ఇవ్వలేదని, అలాగె ఈ ఏడాది డీ ఏ కూడా నిలుపుదల చేసారని వాపోయారు. ఈ బోనస్ లు సాధించడానికి అన్ని సంఘాలను చైతన్యవంతం చేసి ఈ ఏడాది దసరా లోపు బోనస్ లు ,మరియుడీ ఏ లు సాదించేవరకూ పోరాడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెవి. రాజు, సుధీర్ కుమార్, పాపారావు, వి.ఎస్. రావు పాల్గొన్నారు.