TDP Kinjarapu Atchannaidu Challenced to YCP Ministers In Visakhapatnam,Vizagvision ఇల్లులేని నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించేందుకు ‘నా ఇల్లు… నా సొంత’ నినాదంతో టీడీపీ ముందుకెళ్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్ఛిoనాయుడు వెల్లడించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి భాద్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతూ పబ్బం గడుపుకుంతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోవిశాఖ లో ఉన్న నిరుపేదలకు 62 వేల గృహాలను మంజూరు చేస్తే 18 నెలల పాలనలో వైసీపీ ఒక్క ఇల్లు కేటాయించలేదని దుయ్యబట్టారు.ఇసుక, మద్యం పాలసీ తో దోపిడీ చేస్తూ అవినీతిని సెంట్రలైజ్ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా ఉందని అన్నారు.ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా జగన్ సర్కార్ వింత ధోరణిలో వ్యవహరిస్తుందని ఆరోపించారు.రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దానిని టీడీపీ అడ్డుకొని తీరుతుందని అచ్చంనాయుడు పేర్కొన్నారు.సమావేశంలో పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష బాబు,బండారు సత్యన్నారాయణ మూర్తి పట్టాభి, పోతనరెడ్డి తదితరులు పాల్గొని ఆయనను సత్కరించారు.