పాచిపోయిన చికెన్ | ఫ్రెష్ గా లేని ఫిష్ | ఖరీదైన రెస్టారెంట్లలో క్వాలిటీ లేని ఫుడ్ | Visakhapatnam | Vizagvision
ఖరీదైన రెస్టారెంట్లలో క్వాలిటీ లేని ఫుడ్
బార్బిక్యూ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు
నాలుగు రోజుల క్రితం నాటి చికెన్ మటన్ ఫిష్ వండి వడ్డిస్తున్నట్లు గుర్తింపు
రెండు లక్షల వరకు అపరాధ రుసుము విధింపు
మహా విశాఖ నగరంలో ఎంతో క్రేజీగా నడుస్తున్నా రెస్టారెంట్లలో పాచిపోయిన వంటకాలను వేడిచేసి వడ్డించి సొమ్ములు చేసుకుంటున్న వైనం బయటపడింది ఈ రెస్టారెంట్లలో కుటుంబ సమేతంగా భోజనం చేయాలంటే మూడు రోజులు ముందు టేబుల్ బుక్ చేసుకోవాల్సిందే లేకపోతే అక్కడ వేలకు వేలు బిల్లు కడతామని క్యూ కట్టినా ఆ యాజమాన్యం కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అయినా జనం ఆ రెస్టారెంట్లలో తిండి తినడానికి ఎగబడతారు అలాంటి రెస్టారెంట్లలో నాలుగు రోజుల క్రితం వండిన చికెన్, మటన్ ,ఫిష్ ,ప్రాన్స్ వేడి చేసి వడ్డిస్తున్నారు వేలకు వేలు భోజనప్రియులు నుంచి వసూలు చేస్తున్నారు నగరంలోని సాగర్ తీరానికి అతి సమీపంలో గల బార్బిక్యూ రెస్టారెంట్లు ఇదే పరిస్థితి కానవచ్చింది గడిచిన 6, 7 ఏళ్లుగా యమా క్రేజీ గా నడుస్తున్న ఈ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఉదయం దాడులు చేపట్టారు దీంట్లో భాగంగా 4 రోజుల క్రితం వండిన నాన్ వెజ్ కర్రీ లు ఇతర వంటకాలను పరిశీలించి వాటి శాంపిల్స్ పరీక్షలకు పంపించారు సుమారు రెండు లక్షల రూపాయల వరకు అపరాధ రుసుము విధించినట్లు సమాచారం దీంతోపాటు నగరంలోని మరికొన్ని ఇదే కోవకు చెందిన రెస్టారెంట్లపై కూడా మెరుపు దాడులు చేశారు అలాగే పలు రెస్టారెంట్లలో కలర్ సాల్ట్ వాడుతున్నట్లు గా కూడా గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో పాలు రెస్టారెంట్లపై కేసులు పెట్టి అపరాధ రుసుము విధించడం జరిగింది భోజనప్రియులారా.