Beauty of Araku Valley Attracts Tourists పర్యాటకులను కట్టి పడేస్తున్న అరకులోయ అందాలు Visakhapatnam,Vizagvision..అరకులోయ
పర్యాటకులను కట్టి పడేసున్న అరకులోయ అందాలు
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు భారత దేశ నలుమూలల నుండి అరుకు అందాలను తిలకించడానికి భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు.విశాఖ మన్యం అరకులోయ ప్రాంతంలో మంచు అందాలతోపాటు,వలసిపూల అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు.కోవిడ్-19 దృష్ట్యా గత ఆరు నెలలుగా మూతపడిన విషయం విదితమే అయితే తగు జాగ్రత్తలు నడుమ పర్యాటక కేంద్రాలు తెరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో గత రెండు నెలలు నుండి పర్యాటక కేంద్రాలు తోపాటు ప్రదేశాలు తెరుచుకున్నాయి.ఆరు నెలల నుండి పర్యాటక అందాలకు దూరం అయిన పర్యాటకులు పర్యాటక ప్రదేశాలను తిలకించకెందుకుభారీగా తరలి వస్తున్నారు.కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఎక్కడిపడితే అక్కడ పిక్నిక్ సందడి మొదలైంది.ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలో బొర్రా,కటికి జలపాతం,పద్మపురం గార్డెన్, చాపరాయి,తడిగుడ,సరియా,రణాజిల్లెడ,కొల్లపుట్టు మత్స్యగుండం జలపాతం గిరిజన మ్యూజియం, లంబాసింగి తదితర పర్యాటక ప్రాంతలాలో పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది.దీనితోపాటు వలిసేపూల అందాలు మంచు తెరల సోయగాలను పర్యాటకులు ఆస్వాదిస్తూన్నారు.నవంబర్, డిసెంబర్,జనవరి నెలల్లోనే ఏజెన్సీలో గల పర్యాటక కేంద్రాలను పిక్నిక్ స్పాట్ లు ఎంచుకొని పర్యాటకులు తరలి వస్తుంటారు.రోడ్డు ఇరువైపులా వలసిపూల అందాలు పర్యాటకులను కట్టి పడేస్తున్నాయి.వలసిపూల మధ్య ఫోటోలు సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు సంబరపడుతుంటారు.అరుకు, పాడేరు మార్గం చేసుకుంటూ మంచు అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు