సాగర గర్బంలో శిలాతోరణం | Natural Rock formation in the ocean floor | Scuba divers | Live in Adventure | Rushikonda Beach | Visakhapatnam | Vizagvision విశాఖలోని రుషికొండ సముద్ర తీరానికి.. రెండు కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భంలో 30 అడుగుల లోతున సహజ శిలాతోరణం అందరికి ఆసక్తిని కలిగిస్తోంది. ‘లివ్ఇన్ అడ్వంచర్’కు చెందిన స్కూబా డైవర్లు, సుమారు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో ఉండి ఆ పరిసరాలను రికార్డు చేశారు. రుషికొండ సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 30 అడుగుల లోతున సహజ శిలాతోరణం గుర్తించారు. భారీ శిల మధ్య నుంచి గుహలా ఇవి ఏర్పడినట్లు అన్వేషకులు చెబుతున్నారు. విశాఖకు చెందిన ‘లివ్ఇన్ అడ్వంచర్’కు చెందిన స్కూబా డైవర్లు సముద్ర గర్భంలో తరచూ కొత్త ప్రాంతాల అన్వేషణ చేస్తుంటారు. ఇందులో భాగంగా నిర్వాహకులు బలరాంనాయుడితో కూడిన నలుగురి బృందం గతంలో ఎప్పుడూ చూడని శిలలతో కూడిన తోరణం లాంటి ఆకారాన్ని గుర్తించింది. అయితే సుమారు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో ఉండి ఆ పరిసరాలను రికార్డు చేశారు. ఇది ప్రస్తుతం విశాఖలోని మంగమారిపేట సముద్ర తీరంలోని శిలాతోరణాన్ని పోలి ఉందని చెబుతున్నారు. కొన్ని వేల సంవత్సరాలు సముద్రంలోని కొండ అలల తాకిడికి అలా మారి ఉంటుందని బృంద సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇలా శిలాతోరణం చూసిన వెంటనే చాలా సంతోషం అనిపించిందంటున్నారు. గతంలో స్కూబా డైవింగ్ చేసినప్పుడు ఒక షిప్ ను కూడా చూసి బయటప్రపంచానికి తెలియజేశామని,,మరో సారి మా బృంద సభ్యులు శిలాతోరణం వద్దకు మరెన్ని విషయాలు తెలుసుకుంటామని బలరాం నాయుడు అంటున్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/