VIZAGVISION: Boy Attacked a Girl with a Kerosene because of love,Visakhapatnam..విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదనే నెపంతో యువతిపై కిరోసిన్ పోసి దారుణంగా హతమార్చాడు. అడ్డుకోబోయిన యువతి 10 ఏళ్ల తమ్ముడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కేజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. భీమిలి మండలం టినగరం పాలెంలో ఈ ఘటన జరిగింది. సంతోష్ అనే యువకుడు గత ఆరునెలలుగా ప్రేమించమంటూ రూప వెంట పడుతున్నాడు. ఐతే రూప అందుకు అంగీకరించలేదు.ఈ నేపధ్యంలోనే ఇంటిలో ఉన్న రూపపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు సంతోష్. అక్కడే ఉన్న రూప సోదరుడు మంటలను ఆపే ప్రయత్నం చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. అతనీని కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి కూడా విషమంగా ఉంది. మరోవైపు కిరోసిన్ పోసి నిప్పంటించిన సంతోష్ రూప చనిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అక్కడి నుంచి విజయనగరం వెళ్లి అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనలతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యువతిని అత్యంత దారుణంగా హతమార్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ డేటా ఆధారంగా దర్యాప్తును చేస్తున్నారు.