సింహాచలం కొండపై అన్ని సేవలు ఒకే చోట – ప్రత్యేక ర్యాంప్ లు భక్తులకు Visakhapatnam Vizagvision సింహాచలం దేవస్థానం EOగా బాధ్యతలు చేపట్టాక సంస్కరణలు, అవసరమైన మార్పులకు ఎంవీ సూర్యకళగారు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా భక్తులకు సేవలను అందించే విషయంలో ఆమె ఏమాత్రం రాజీ పడటం లేదు. ఇందులో భాగంగానే కంప్లైంట్ సెల్ ఏర్పాటుచేశారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యంకలిగినా , దేవస్థానం భూముల విషయంలో ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చంటూ రెండు ఫోన్ నంబర్లు (0891-2764949, 9398523937), కంప్లైంట్లు స్వీకరణ బాధ్యత సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఇవ్వడం జరిగింది. కొండపై టికెట్లు ఇచ్చే చోటు ఒక దగ్గర, విరాళాలు స్వీకరించే ప్రాంతం మరోదగ్గర, ప్రొటోకాల్ – కౌండపై రూంలు బుకింగ్ కౌంటర్ ఇంకో చోట ఉండటంతో భక్తులు, దాతలు గందరగోళానికి గురయ్యేవారు. ఇప్పుడు దానికి చెక్ పెడుతూ… విరాళాలు, టికెట్ల కౌంటర్లను PRO ఆఫీసులో పెట్టడం జరిగింది. దీంతో భక్తులు ఎలాంటి సేవలు కావాలన్నా… గాలిగోపురం ఎదురుగా ఉండే పీఆర్వో ఆఫీసులో పొందవచ్చు. కొండ కింద టికెట్ టికెట్ తీసుకోనివారు నేరుగా ఇక్కడే వచ్చి ఆ సేవలను పొందవచ్చు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆపీసును తీర్చి దిద్దడం జరిగింది. అంతేకాదు కోవిడ్ నిబంధనల దృశ్యా స్వామివారి దర్శనం దగ్గర క్యూలైన్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శనాలకోసం మూడు ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవడం సులభమవుతోంది. ఈ సౌకర్యాలను శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి భక్తులు ఉపయోగించుకోవచ్చు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/