VIZAGVISION:Nit Students Drugs Case Arrested Warangal,Visakhapatnam…వరంగల్ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నఇద్దరు విద్యార్థులను ఖాజీపేట ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిజ్జు , రమేష్ అనే విద్యార్థులు కొద్ది రోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మధ్య డగ్ర్స్ కేసులో హైద్రాబాద్లో దొరికిన నిందితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.