ఉక్కు పరిపాలనా భవనం ముట్టడి Steel Plant Visakhapatnam Vizagvision #Vizagvision ఉక్కు పరిపాలనా భవనం ముట్టడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిexస్తున్నా అఖిలపక్ష కార్మిక సంఘాలు మంగళవారం ఉక్కు ప్రధాన పరిపాలనా కార్యాలయాన్ని ముట్టడించాయి. ముక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, అయోధ్య రామ్, మస్తాన్ అప్ప , గంధం వెంకట్రావు ల నాయకత్వంలో కార్మికులు ఉక్కు ప్రధాన ద్వారాన్ని, పరిపాలన భవనాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది కార్మికులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే కేంద్రం వెనక్కు తీసుకోవాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు షేర్లు శత శాతం వ్వూహాత్మక అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలో అసమానతలకు ఆజ్యం పోస్తున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అఖిలపక్ష ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ నాయకులు మాట్లాడారు. పరిపాలనా భవనం ముట్టడి కార్యక్రమం లో వివిధ సంఘాల కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు. VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/